దుబాయ్‌లో నాలుగేళ్ళలో భారీగా పెరిగిన అద్దెలు
- January 11, 2016
దుబాయ్‌లో గడచిన నాలుగేళ్ళలో ఇంటి అద్దెలు 55 శాతం పెరిగినట్లు సర్వేలే చెబుతున్నాయి. పెరుగుతున్న అద్దెల్ని భరించలేనివారు తక్కువ అద్దెలున్న ఇళ్ళ వైపు చూస్తున్నారు. మార్కెట్ అంచనాలు సైతం ప్రజలకు అందుబాటులో లేని విధంగా అద్దెలు పెరుగుతున్నట్లు వెల్లడిస్తున్నాయి. 2011 నాటికీ ఇప్పటికీ దుబాయ్ మెరీనాలో 50 శాతం అద్దెలు పెరిగాయనీ, ఇంటర్నేషనల్ సిటీలో కూడా 93 శాతం పెరిగాయని జిసిపి ప్రాపర్టీస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ హుస్సేన్ అల్లాదిన్ చెప్పారు. పరిస్థితుల్ని అంచనా వేస్తూ డెవలపర్స్ బడ్జెట్‌తో కూడిన ప్రాజెక్ట్స్‌ని అందుబాటులోకి తెస్తున్నారు. ఇలాంటి వైపు సామాన్యులు మొగ్గుచూపుతున్నారు. అయితే, తగిన సౌకర్యాలను కల్పించడం ద్వారా అద్దెలను పెంచవలసి వస్తుందని డెవలపర్స్ కూడా అంటున్నారు. 55,000 దిర్హామ్‌ల నుంచి 40,000 దిర్హామ్‌లకు అద్దెను తగ్గించుకున్నామని ఓ ఫ్యామిలీ దుబాయ్‌లో పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పింది. అలాగే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రెంట్లు కూడా పెరుగుతున్నందున, తప్పదని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







