దుబాయ్ లో సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్
- January 11, 2016
దుబాయ్ లో జనవరి 29న సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ జరగనుంది. ఈ పోటీల్లో చెన్నయ్ ఈగల్స్, ఫాల్కన్ ఫైర్స్, నాచురల్స్ పీకాక్ మరియు సిఆర్వి పెలికాన్స్ అనే జట్లు పోటీపడ్తున్నాయి. ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. అలాగే, పోటీలకు మద్దతుగానూ పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు హాజరవుతారు. నాలుగు జట్లలో అరణ్ విజయ్, జయమ్ రవి, మీనా, భరత్ ఆయా జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. దుబాయ్లోని ఇండియన్స్కి ఈ పోటీలు కనువిందు చేయనున్నాయి. ఛారిటీ కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది. నిర్వాహకులు సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ని విజయవంతం చేయడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఈవెంట్ ని మన తెలుగు వారిదయిన అంజన్ స్టార్ ఈవెంట్స్ వారిచే ప్రతిస్తాత్మికంగా నిర్వహిస్తోంది.





తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







