అమెరికా FBI కే చుక్కలు చూపిస్తున్న భారతీయుడు..!!!

- October 20, 2019 , by Maagulf
అమెరికా FBI కే చుక్కలు చూపిస్తున్న భారతీయుడు..!!!

అతడి పేరు భద్రేశ్ కుమార్, చూడటానికి ఎంతో సున్నితంగా ఉన్నట్టు కనిపిస్తాడు, నోట్లో వేలు పెట్టినా కొరకగలడా అనే సందేహం వస్తుంది అతడిని చూస్తే. కానీ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన సంస్థగా పేరొందిన అమెరికా దర్యాప్తు సంస్థ FBI కే చుక్కలు చూపిస్తున్నాడు. కొన్నేళ్లుగా సదరు సంస్థకి కనపడకుండా దొంగా పోలీస్ ఆడుతున్న అతడు ఇప్పటికి కూడా కనపడక పోవడం పెద్ద సవాల్ గా మారింది.

ఏకంగా అతడిపై 70 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. అంతేకాదు FBI టాప్ 10 వాంటెడ్ లిస్టు లో చోటు కూడా దక్కించుకున్నాడు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏమిటంటే. భారత్ లోని అహ్మదాబాద్ కి చెందిన భద్రేశ్ కుమార్,అమెరికాలోని డంకిన్ డోనట్స్ స్టోర్ లో పనిచేస్తున్నాడు. 2015 ఏప్రియల్ లో తన భార్య తో కలిసి తను పనిచేస్తున్న స్టోర్ లోకి వెళ్ళిన అతడు కొద్ది సేపటి తరువాత బయటకి ఒక్కడే వచ్చాడు.

ఆ తరువాత స్టోర్ లో నుంచీ రక్తపు మరకలు కనపడటంతో పోలీసులకి సమాచారం అందించడంతో హంతకుడు భర్తే నని తేల్చి అప్పటి నుంచీ అతడిని వెతకడం మొదలు పెట్టారు. భారత్ లో చాలా రాష్ట్రాలలో సైతం వెతికిన FBI అమెరికాలో సైతం జల్లెడ పట్టినా ఇప్పటికి అతడి జాడ కనపడక పోవడం పెద్ద సవాల్ గా మారింది. దాంతో ఇరు దేశాల పోలీసులు కలిసి సోదిస్తున్న అతిపెద్ద కేసుగా రికార్డ్ సృష్టించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com