అ! తర్వాత నాని ‘హిట్’ గ్యారెంటీ!!
- October 24, 2019


హైదరాబాద్: విభిన్న కథాచిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఎలాంటి వారసత్వ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. మంచి కథలను ఎంచుకుంటు.. ఓ చిన్న హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఇప్పుడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా మారి విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. నాని ఇంతకుముందు వైవిధ్యభరితమైన ‘అ!’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు.
ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు అవార్డులు అందుకుంది. తాజాగా నాని మరో సినిమాను నిర్మిస్తున్నాడు. తన వాల్‌పోస్టర్ సినిమా సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విశ్వేక్‌సేన్ (ఈ నగరానికి ఏమైంది ఫేమ్), రుహాని శర్మ (చి.ల.సౌ. ఫేమ్) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శైలేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు ప్రశాంతి నిర్మాత. ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో పూజకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో-హీరోయిన్ల తొలి సీన్‌కు నాని క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమా పోస్టర్‌ను నాని ట్విటర్‌లో విడుదల చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







