డ్రిఫ్టింగ్: ఒమన్‌లో ఇద్దరి అరెస్ట్
- October 24, 2019
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాలతో డ్రిఫ్టింగ్‌కి పాల్పడుతూ, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరించారనే అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్, ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఆన్ లైన్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. పబ్లిక్ కంఫర్ట్‌ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తూ డ్రిఫ్టింగ్‌కి పాల్పడేవారిపై కఠిన చర్యలు వుంటాయని అధికారులు హెచ్చరించారు. నిందితులపై చట్టపరమైన చర్యలుంటాయనీ, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి నిందితుల్ని అప్పగించడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







