యూఏఈని కమ్మేసిన పొగమంచు: వాహనదారులకు సూచనలు
- October 24, 2019
యూఏఈ లోని పలు ప్రాంతాల్లో పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) ఈ మేరకు వాహనదారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. మిస్ట్ అలాగే ఫాగ్ ఫార్మేషన్ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. షార్జా ఎయిర్‌పోర్ట్ ఏరియా, స్వీహాన్ మరియు మదినాత్ జాయెద్ అలాగే అల్ మిన్హాద్ ప్రాంతాల్లో ఎక్కువగా పొగమంచు కన్పించింది. మరికొద్ది రోజులపాటు ఇదే వాతావరణ పరిస్థితులు యూఏఈలో వుంటాయని ఎన్‌సిఎం పేర్కొంది. వాహనదారులు తమ వేగాన్ని గంటకు 80 కిలోమీటర్ల కంటే మించకుండా చూసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా వుంటే, కోస్టల్ ఏరియాస్‌లో హ్యుమిడిటీ 70 నుంచి 90 శాతం వరు వుంటుందనీ, ఇంటీరియర్ రీజియన్స్‌లోనూ ఇదే పరిస్థితులు కొనసాగుతాయనీ, మౌంటెయిన్స్‌లో 50 నుంచి 70 శాతం హ్యుమిడిటీ వుంటుందని ఎన్‌సిఎం పేర్కొంది. సోమవారం వరకు ఫాగీ మరియు హ్యుమిడ్ వాతావరణం యూఏఈలో కొనసాగుతుంది.
తాజా వార్తలు
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..







