`భారతీయుడు 2` లో కమల్ లుక్ లీక్
- October 24, 2019
స్టార్ డైరెక్టర్ శంకర్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తాను చేస్తున్న సినిమా కి సంబంధించి ఎక్కడ లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సెట్ నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా చాలా పకడ్భందీగా షూట్ చేస్తాడు. కానీ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాకి కూడా లీక్ బెడద తప్పలేదు.
అతను తీస్తున్న `భారతీయుడు 2` నుంచి ఒక ఫోటో బయటకు వచ్చి వైరల్ అవుతుంది. కీలకమైన ఆ ఫోటో ఆన్ లొకేషన్ నుంచి ఓ లుక్ లీకైపోయింది. సెల్ ఫాలెన్ నుంచి ఎవరో తీసినట్టు అర్ధం అవుతుంది. కమల్ హాసన్ సేనాపతి గెటప్ లో ఓ గుర్రంపై వెళుతున్నారు. అది కూడా మార్కెట్ వీధుల్లో గుర్రంపై కూచుని టీవీగా స్వారీ చేస్తున్నాడు సేనాపతి. ఇందులో కమల్ 90 ఏళ్ళ వృద్దుడి పాత్రలో కనిపించనున్నాడు. మొదటి పార్ట్ లో 70 ఏళ్ళ సేనాపతిగా కనిపిస్తే ఇప్పుడు 90 ఏళ్ళ సేనాపతి గా కనిపించనున్నాడు అని ఆ ఫోటో చూస్తే అర్ధం అవుతుంది. లీకెడ్ ఫోటోనే అలా ఉంటే ఇంకా ఒరిజినల్ ఫోటో ఎలా ఉంటుందో? అసలు కమల్ హాసన్ ముసలోడి పాత్రలో ఎలా ఉంటాడో అని ఇప్పటి నుంచే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







