మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాలీవుడ్ హీరో..మరి ఆ హీరో ఏమన్నాడో చూడండి..
- October 31, 2019
ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కూడా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తమకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని మొదటి నుండి పట్టుబడుతున్న మిత్రపక్షమైన శివసేనకు డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను కూడా ఆఫర్ చేసింది.ఇలాంటి తరుణంలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ముఖ్యమంత్రి ఏమిటని ఆలోచిస్తున్నారా .. ?.
అయితే ఇది రియల్ గా కాదు రీలో ముఖ్యమంత్రిగా అనిల్ కపూర్ నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నాయక్ (ఒకే ఒక్కడు మూవీ రీమేక్)లో హీరో అనిల్ కపూర్ మెయిన్ రోల్ గా రాణి ముఖర్జీ ,అమ్రిష్ పురిలు ప్రధాన పాత్రలు పోషించిన సంగతి విదితమే. ఈ మూవీలో హీరో అనిల్ కపూర్ ఒక రోజు ముఖ్యమంత్రిగా ఉండి తన బాధ్యతలను నిర్వహిస్తాడు.
దీనిని ఆధారంగా చేసుకుని నెటిజన్లు హీరో అనిల్ కపూర్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని ట్వీటులో కామెంట్లు చేస్తోన్నారు. అక్కడితో ఆగకుండా దేవేంద్ర ఫడ్నవీస్,ఆదిత్య ఠాక్రేలలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారో తేల్చేవరకు అయిన అనిల్ కపూర్ ను ముఖ్యమంత్రిగా ఉండమనండి అని ట్వీట్స్ చేస్తున్నారు. దీనికి స్పందించిన అనిల్ కపూర్ 'నాయక్ మూవీలో నేను నాయకుడ్ని మాత్రమే 'అని ట్విట్టర్ లో రిప్లై ఇచ్చారు. దీనికి నెటిజన్లు సినిమాలో ముందు వద్దు అని ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా.. ఇప్పుడు కూడా అంతే అని రీట్వీటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







