టిఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
- November 02, 2019
హైదరాబాద్:ఆర్టీసీ సమ్మెపై మరోసారి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రసక్తే లేదని మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఆర్టీసీ యూనియన్లు అనాలోచితంగా సమ్మె చేస్తున్నాయని, దురహంకారపూరితంగా కార్మికులు సమ్మెలోకి వెళ్లారని వెల్లడించారు. 2019, నవంబర్ 02వ తేదీ శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మొత్తం 49 అంశాలపై చర్చించారు. కేబినెట్ సమావేశాలకు సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్ మీడియాకు వివరించారు.
తాను రవాణా శాఖగా తాను పనిచేసినట్లు తెలిపారు. కొన్ని మార్పులు చేయాల్సినవసరం ఉందన్నారు. 5 వేల 100 ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించడం జరిగిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అనేది బాధ్యతాయుతమైన వ్యవహరమని, ప్రభుత్వంలో విలీనం చేయకూడదని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 10 వేల 400 బస్సులను ఆర్టీసీ నడుపుతోందన్నారు. సమ్మెలోకి వెళ్లవద్దని చెప్పినట్లు..నిపుణుల కమిటీ వేయడం జరిగిందని చెప్పినా..కార్మికులు సమ్మెలోకి వెళ్లారని తెలిపారు.
సమ్మె విరుద్ధమని కోర్టుకు సమర్పించినట్లు, ఇల్లీగల్ స్ట్రైక్ అని డిక్లైర్డ్ చేస్తే..యాజమాన్యం..కార్మికులకు సంబంధాలు తెగిపోతాయన్నారు. కార్మికుల నోట్లో మట్టి కొట్టారని...మొత్తంగా 49 వేల మంది కార్మికుల రోడ్లపై పడాల్సి వచ్చిందన్నారు. ప్రతిపక్షాల మాటలను నమ్మి..భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తున్నారని, ఇది ఏ మాత్రం లాభం కాదన్నారు సీఎం కేసీఆర్.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







