సైక్లోన్‌ మహా: ఈ జాగ్రత్తలు తప్పనిసరి

- November 04, 2019 , by Maagulf
సైక్లోన్‌ మహా: ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ట్రోపికల్‌ స్టార్మ్‌ మహా ప్రస్తుతం కేటగిరీ 1 సైక్లోన్‌గా రూపాంతరం చెందుతోంది. యూఏఈ ఈస్ట్‌ కోస్ట్‌ ప్రాంతంపై ఈ ప్రభావం ఎక్కువగానే వుండబోతోందని నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ మిటియరాలజీ (ఎన్‌సిఎం) అంచనా వేస్తోంది. బుధవారం నుంచి యూఏఈపై సైక్లోన్‌ మహా ఎఫెక్ట్‌ వుంటుందనీ, ఈ కారణంగా పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోతుందనీ అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పౌరులు, నివాసితులు అప్రమత్తంగా వుండాలని యూఏఈ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పిల్లల్ని ఔట్‌డోర్‌కి పంపించవద్దని ఆ హెచ్చరికల్లో పేర్కొన్నారు. విలువైన వస్తువుల్ని వాటర్‌ ప్రూఫ్‌ కంటెయినర్స్‌లో జాగ్రత్త చేసుకోవాలనీ, టార్చిలైట్లు, లాంతర్లు, క్యాండిల్స్‌ అందుబాటులో వుంచుకోవాలని కూడా సూచిస్తున్నారు అధికారులు. గ్లాస్‌ విండోస్‌, డోర్స్‌కి దూరంగా వుండాలి. ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు ప్రవహిస్తున్న ప్రాంతాలకు దగ్గర వుండకూడదు. డ్రైవింగ్‌లో వుంటే ఎప్పటికప్పుడు వెదర్‌ రిపోర్ట్స్‌ గురించి తెలుసుకోవాలి. ముందు వెళుతున్న వాహనాలకు దూరం పాటించాలి. రోడ్డుపై వాహనాన్ని నిలపాలనకుంటే పూర్తిగా రోడ్డుకి పక్కగా సేఫ్‌ ప్లేస్‌లోనే ఆ పని చేయాలి. తమ క్షేమ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com