గుమ్మడి గింజల నూనె ఉపయోగాలు...
- November 05, 2019
గుమ్మడి మరియ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరియు ఇందులో పుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
1. గుమ్మడిలో విటమిన్ ఎ, సి, ఇ, కె లు మరియు యాంటీయాక్సిడెంట్స్, ఇంకా జింక్ మరియు పుష్కలమైనటువంటి మెగ్నీషియం ఉండి మొత్తం శరీర ఆరోగ్యనికి మేలు చేస్తుంది.
2. దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.
3. గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా ఉపయోగపడుతాయి. క్యాన్సర్‌లో ఎటువంటి క్యాన్సర్ అయినా సరే గుమ్మడి గింజలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్లను నివారించగలిగే రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. గుమ్మడి ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది.
4. డయాబెటీస్ రాకుండా ఉండేందుకు , వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది . గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది.
5. గుమ్మడి గింజల నుంచి తీసే నూనె వాడడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారిలో కిడ్నీ ఆరోగ్యానికి కూడా కాపాడుతుంది.
6. గుమ్మడి గింజల్లో వివిధ రకాల నొప్పులను నివారించగలిగే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వివిధ రకాల నొప్పులను మరియు బాధల నుండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నివారిస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







