ఎల్ఐసీ పాలసీదారులకు ఒక శుభవార్త

- November 05, 2019 , by Maagulf
ఎల్ఐసీ పాలసీదారులకు ఒక శుభవార్త

మధ్యతరగతి కుటుంబాలలో చాలావరకు ఎల్ఐసీలో ఏదోఒక పాలసీ ఉంటుంది. తాజాగా తన కస్టమర్లకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంచి శుభవార్త అందించింది. ఎక్కువమంది పాలసీదారులు కొన్నాళ్ళ వరకు ప్రీమియం సమయానికే చెల్లించి, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆపేయటం లాంటిది జరుగుతూ ఉంటుంది. దీంతో ఎల్‌ఐసీ పాలసీ లాప్స్ అవుతూ ఉంటాయి. ప్రీమియం చెల్లించలేక రెండేళ్లకు పైగా ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవచ్చునని తాజాగా సంస్థ స్పష్టం చేసింది. తద్వారా ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ఓ చక్కటి అవకాశం ఇచ్చింది. 2013 irdai ప్రాడక్ట్స్ రెగ్యులేషన్స్ 2013 ప్రకారం 2014 జనవరి 1వ తేదీ నుంచి ప్రిమియం చెల్లించని గడువు నుంచి కేవలం రెండేళ్ల లోపు ల్యాప్స్ అయిన పాలసీలకు మాత్రమే ఈ అవకాశం ఉండేది.

ఎల్ఐసీ కొత్త రూల్స్ ప్రకారం సాంప్రదాయ నాన్ లింక్డ్ పాలసీ పునరుద్ధరణకు ఐదేళ్ల వరకు గడువు ఉంది. యూనిట్ లింక్డ్ పాలసీలకు 3 ఏళ్ల గడువు ఇచ్చింది సంస్థ. పాలసీ ల్యాప్స్ అయిన వారికి ఇది ఊహించని శుభవార్త అని చెప్పవచ్చు. దీంతో పాలసీదారులు వారి పాలసీల్ని తిరిగి పునరుద్ధరించుకోవచ్చునని తెలిపింది. పాలసీ ప్రయోజనాలను మళ్లీ యథావిధిగా పొందవచ్చు. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల ప్రీమియం చెల్లించలేని వారు బీమాకు దూరమై పాత పాలసీని కొనసాగించలేక, కొత్త పాలసీ తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని, తాజా పునరుద్ధరణ సదుపాయం పాలసీదారులకు అద్భుత అవకాశమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com