జలుబుకు చక్కటి చిట్కాలు
- November 08, 2019
చాలామంది జలుబు రాగానే ఇంగ్లీషు మందులు వేసుకుంటూ వుంటారు. ఐతే ఈ చిట్కాలు పాటిస్తే జలుబు తగ్గిపోతుంది.
1. అల్లంతో టీ పెట్టుకోండి రోజూ మూడు నాలుగు మార్లు త్రాగాలి.
2. పసుపు కొమ్మును కాల్చి ఆ పొగ పీలిస్తే ముక్కుదిబ్బడ తగ్గుతుంది.
3. అరచెంచా మిరియాల పొడి -ఒక చెంచా బెల్లం పొడి కప్పు నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉండగానే కొద్దికొద్దిగా సిప్ చేయండి.
4. స్టీమ్ పీల్చడం వలన ముక్కులు బిగేసింది తగ్గుతుంది. శ్లేష్మం ఫ్రీ అయ్యి బయటక పోతుంది.
5. కప్పు వేడి పాలలో అరచెంచా శుద్ధమైన పసుపు వేసి రోజూ రెండుమూడు మార్లు త్రాగాలి.
6. వేడివేడిగా వెజిటబుల్ సూప్స్... పెప్పర్, సాల్ట్ వేసుకొని తీసుకోండి రోజూ రెండుసార్లు.
7. ఒక కప్పు నీటిలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మరగనిచ్చి ఈ నీరు త్రాగాలి.
8. చికెన్ సూప్ మీకు అద్భుతంగా జలుబుపై ప్రభావం చూపింస్తుంది.
9. తులసి ఆకులు అయిదారు తీసుకొని నమిలి మ్రింగాలి. లేదంటే తులసి ఆకులతో డికాక్షన్ పెట్టి ఆ డికాషన్ రోజుకు మూడునాలుగు సార్లు త్రాగాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







