దుబాయ్‌ రన్‌ 30 30: పోటెత్తిన జనం

దుబాయ్‌ రన్‌ 30 30: పోటెత్తిన జనం

దుబాయ్‌: దుబాయ్‌లో వేలాదిమంది జనం పోటెత్తారు. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నుంచి ఈ జన సందోహం కన్పించింది. దుబాయ్‌ రన్‌ 30I30లో భాగంగా ఈ రన్‌ చేపట్టారు. ఈ నేపథ్యంలో నిత్యం బిజీగా వుండే షేక్‌ జాయెద్‌ రోడ్డులో కొంత భాగాన్ని ఈ కార్యక్రమం కోసం కేటాయించారు. అన్ని వయసులవారికీ, అన్ని జాతీయులవారికీ ఈ పరుగులో అవకాశం కల్పించారు. దుబాయ్‌ రన్‌ 30 30లో 5 కిలోమీటర్ల పరుగు, 10 కిలోమీటర్ల పరుగు ఉదయం 6.30 నిమిషాలకు ప్రారంభమయ్యాయి. దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్, దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

Back to Top