శబరిమల అయ్యప్ప సన్నిధానంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు రేపే

- November 13, 2019 , by Maagulf
శబరిమల అయ్యప్ప సన్నిధానంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు రేపే

న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం తన తుది తీర్పును వెలువడించబోతోంది. దీనికి సంబంధించిన లిస్టింగ్ బుధవారం వెల్లడైంది. దీనితో పాటు- రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటీషన్లపైనా తీర్పు వెలువడనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఈ నెల 17వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నందున ఈ మూడు కేసులపైనా ఒకేరోజు తీర్పు ఇవ్వనున్నారు.

తన తీర్పును తానే పున:సమీక్షించుకున్న సుప్రీంకోర్టు..
కేరళలో పత్తినంథిట్ట జిల్లాలోని దట్టమైన అడవుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి సన్నిధానంలో 50 సంవత్సరాల లోపు మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాదే తన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన అనంతరం సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబర్ లో ఈ తీర్పు ఇచ్చింది. నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ రోహిన్టన్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసుపై తీర్పు ఇచ్చింది. ఎనిమిదేళ్ల నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు అయ్యప్ప స్వామిని ఎందుకు దర్శించకూడదని, ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ ఆమె ఈ పిటీషన్ దాఖలు చేశారు.

మహిళల నుంచే తీవ్ర నిరసన..
సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పట్ల హిందూ సంఘాలు, మహిళల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. తీర్పు నేపథ్యంలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన 50 సంవత్సరాల లోపు మహిళలను మలయాళీలు అడ్డుకున్నారు. దీనికోసం వందలాది మంది మహిళలు స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వచ్చారు. ఆలయానికి రక్షణగా నిల్చున్నారు. సేవ్ శబరిమల పేరుతో ఓ ఉద్యమాన్ని లేవదీశారు. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు శబరిమల ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న మహిళల సంఖ్య రెండంకెలను కూడా అందుకోలేకపోయింది. 

తీర్పుపై పున: సమీక్ష..
హిందు సమాజం నుంచి స్వచ్ఛందంగా వెల్లువెత్తిన నిరసనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. మహిళల ప్రవేశానికి ఇదివరకు ఇచ్చిన తీర్పును పున: సమక్షించాలని కోరుతూ ఏకంగా 65 రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. గత ఏడాది తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా మినహా ధర్మాసనంలోని మిగిలిన సభ్యులందరూ ఇప్పుడు కూడా కొనసాగడం విశేషం. దీపక్ మిశ్రా పదవీ విరమణ తరువాత రంజన్ గొగొయ్ సారథ్యంలో శబరిమల కేసు విచారణ కొనసాగింది. జస్టిస్ రోహిన్టన్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలే ఇప్పుడూ ఉన్నారు. 

ఇందు మల్హోత్రా మినహా..
అయిదుమంది సభ్యుల ధర్మాసనంలో కొనసాగిన న్యాయమూర్తుల్లో జస్టిస్ ఇందు మల్హోత్రా మినహా మిగిలిన నలుగురూ తీర్పుకు అనుకూలంగా వ్యవహరించారు. తీర్పు పాఠంపై ఇందు మల్హోత్రా మినహా మిగిలిన నలుగురు జస్టిస్ రోహిన్టన్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలే ఇప్పుడూ ఉన్నారు. నాటి తీర్పును ఇందు మల్హోత్రా వ్యతిరేకించారు. హిందూ సంప్రదాయాన్ని, సంస్కృతిని కించపరిచేలా తీర్పు ఉండకూడదనేది ఆమె ఉద్దేశమని, హైందవ ఆచార, వ్యవహారాల్లో జోక్యం తగదని ఆమె అప్పట్లో అభిప్రాయపడ్డారు. 50 ఏళ్ల లోపు మహిళలు అయ్యప్పస్వామి సన్నిధాన్ని దర్శించుకోవడం సంప్రదాయ విరుద్ధమని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com