"తోలుబొమ్మలాట" సెన్సార్ పూర్తి, ఈ నెల 22 న విడుదల!!
- November 15, 2019
డా. రాజేంద్రప్రసాద్ నటించిన కుటుంబ కథా చిత్రం 'తోలుబొమ్మలాట' సెన్సార్ పూర్తి చేసుకుని ఈ నెల 22 న విడుదల కానుంది . విశ్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్, దేవీ ప్రసాద్, నర్రా శ్రీనివాస్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని సుమదుర్గా క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య మాగంటి సమర్పణలో దుర్గాప్రసాద్ మాగంటి నిర్మించారు. విశ్వనాథ్ మాగంటి దర్శకునిగా పరిచయమవుతున్నారు.
నిర్మాత దుర్గాప్రసాద్ మాగంటి మాట్లాడుతూ ''ఒక కుటుంబంలోని మూడు తరాల మధ్య జరిగే దోబూచులాటలాంటిది ఈ సినిమా. అవసరాలు, అపోహలు, అపార్థాలు, కలలు, కన్నీళ్లు, కలవరాలు, కల్లోలాలు, అభిమానాలు, ఆత్మాభిమానాలు వంటి భావోద్వేగాల కలబోత ఈ చిత్రం. ఒక కుర్రాడు ఇంత లోతైన, ఉద్వేగభరితమైన భావాలున్న కుటుంబ కథని ఎలా ఎదుర్కొని, పరిష్కరించాడు అని రేపు తెరపై చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. థ్రిల్ ఫీలవుతారు. ఏ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కచ్చితంగా అందరి హృదయాల్లో స్థానం సంపాదిస్తుందని మా నమ్మకం. ఇటీవల విడుదలయిన ట్రైలర్ కి మరియు పాటలకి మంచి స్పందన లభించింది . ఓవర్సీస్ విడుదల హక్కులను గోల్డెన్ ఈగిల్ ఫిలిమ్స్ ఎల్.ఎల్.సి వారు పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్నారు '' అని చెప్పారు.
నటీనటులు:
డా. రాజేంద్రప్రసాద్ , విశ్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్, దేవీ ప్రసాద్, నర్రా శ్రీనివాస్
సంగీత, కల్పన, శిరీష సౌగంద్, ధన్‌రాజ్, పూజా రామచంద్రన్, నారాయణరావు, చలపతిరావు, ప్రసాద్‌బాబు, 'తాగుబోతు' రమేష్, 'బస్టాప్' కోటేశ్వరరావు, అల్లు రమేష్ తదితరులు.
సాంకేతికనిపుణులు:
ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: మోహన్.కె.తాళ్లూరి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ నూకవల్లి
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







