ఖతార్:షూటింగ్ లో మూడు స్వర్ణాలు గెలిచిన హైదారాబాద్ అమ్మాయి
- November 15, 2019
ఖతార్:ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో హైదరాబాద్ కు చెందిన 14 ఏళ్ల ఇషా సింగ్ సత్తా చాటింది. ఖతార్‌లోని దోహాలో జరిగిన 14 వ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇషా సింగ్ ..2022 యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యం అని అన్నది. 9 సంవత్సరాల వయస్సులో షూటింగ్ ప్రారంభించానని చెప్పింది. తాను చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నానని.. దీనికి చాలా అంకితభావం అవసరమని తెలిపింది.
తాను ఈరోజు ఈ స్థాయికి చేరుకోవటానికి చాలా కష్టపడ్డాననీ..కష్టపడితే సాధ్యం కానిదంటూ లేదని తెలిపింది. 2022 యూత్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించటమే నా లక్ష్యం అంటోంది హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







