లులు కంపెనీ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తున్నామని ప్రకటించిన గౌతమ్‌రెడ్డి
- November 21, 2019
అమరావతి: లులుకి మించిన పెద్ద పెద్ద కంపెనీలు ఏపీలో ఉన్నాయని ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో కన్వెన్షన్ హాల్ నిర్మించే సామర్థ్యం ఏపీఐఐసీకి ఉందన్నారు. సింగిల్ బిడ్ రావడం, భూమి ప్రైమ్ ఏరియాలో ఉండడంతో.. లులు కంపెనీ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఏపీఐఐసీ వద్ద కూడా గొప్ప టెక్నాలజీ ఉందని, గతంలో హైటెక్స్‌ని ఏపీఐఐసీనే నిర్మించిందని గౌతమ్‌రెడ్డి అన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కోసం అనంతపురంలో రూ.వెయ్యి కోట్లతో వీరా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నామని మంత్రి తెలిపారు. ఆర్బిట్రేషన్ ప్రతి ఒక్కరి హక్కని, పీపీఏలపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లడంలో తప్పులేదని మంత్రి గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







