ఏపీలో నూతన బార్ పాలసీపై ఉత్తర్వులు జారీ
- November 22, 2019
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన బార్ పాలసీని శుక్రవారం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలయ్యే ఈ పాలసీ ప్రకారం బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజును రూ. 10 లక్షలుగా నిర్ణయించారు. ఇది నాన్ రిఫండబుల్. లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించనుండగా, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వ్యాపార వేళలుగా నిర్ణయించారు. లైసెన్స్ గడువు రెండేళ్ల వరకు ఉంటుంది. లైసెన్స్ ఫీజులను చూస్తే 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 25 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 75 లక్షలుగా ఫీజును నిర్ణయించారు. మరోవైపు సామాన్యులకు మద్యాన్ని దూరం చేసేందుకు బార్లలో మద్యం అమ్మకాలపై అదనపు పన్ను వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..