'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా టైటిల్ మార్పు..
- November 27, 2019
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, సన్నివేశాల విషయంలో పలు ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌కు ప్రత్యేక అతిధిగా విచ్చేసిన వర్మ.. సినిమా టైటిల్‌ను సడన్‌గా మార్చేశారు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్‌ను 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' అని మార్చారు.
ఈ సినిమా టైటిల్‌పై పలు వివాదాలు చెలరేగడమే కాకుండా.. కేఏపాల్ కూడా తనను కించపరిచేలా ఉందని ఫిర్యాదు చేయడంతోనే టైటిల్ మార్చానని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుండగా.. ఏపీలో మాత్రం ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందో లేదో వేచి చూడాలి.
తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







