షూటింగ్‌లో రిస్కీ స్టంట్స్.. నటుడు మృతి
- November 28, 2019
రియాలిటీ షోలు.. రేటింగ్‌లు వస్తాయేమో కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు. టీవీల ముందు కూర్చుని చూసే వాళ్లకే ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉంటాయి. అలాంటిది ప్రాణాలకు తెగించి వారు చేస్తున్న ప్రయోగాలు పట్టు తప్పితే ఎంతటి ప్రమాదాన్ని కొని తెస్తాయో ఊహించకపోరు. అయినా అలాంటి వాటిని ప్రోత్సహిస్తూ షోలు చేస్తుంటారు. షో చూడ్డానికి గెస్ట్‌గా వచ్చిన 35 ఏళ్ల నటుడు వారు చేసే విన్యాసాలు చూసి గుండె ఆగి మరణించాడు.
చైనాకు చెందిన ప్రముఖ మోడల్, యాక్టర్ గాడ్‌ఫ్రే గావో చేజ్ మీ అనే టీవీ రియాలిటీ షోకు అతిధిగా హాజరయ్యాడు. షో చిత్రీకరణ చూస్తూ హఠాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే అక్కడున్న వారు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయినా లాభం లేకపోయింది. అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. షోలో భాగంగా కంటెస్టెంట్ చేసిన స్టంట్స్ చూసి ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని చేజ్ నిర్వాహకులు స్పందిస్తూ.. ఆయన పడిపోయిన వెంటనే అక్కడే ఉన్న డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉందని భావించిన డాక్టర్లు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు కాపాడలేకపోయారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు గాడ్‌ఫ్రే మోడల్ రంగంలో అడుగు పెట్టి అక్కడి నుంచి నటుడిగా ఎదిగాడు. పలు హాలీవుడ్, చైనీస్ సినిమాలలో నటించిన గాడ్‌ఫ్రే మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. అంతలోనే మృత్యువు అతడిని కబళించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







