మొట్టమొదటిసారిగా ఇండియా లో యూఏఈ నేషనల్ డే వేడుకలు..

- November 28, 2019 , by Maagulf
మొట్టమొదటిసారిగా ఇండియా లో యూఏఈ నేషనల్ డే వేడుకలు..

 

యూఏఈ-భారత్ సంబంధాలు దృఢపడ్డ తరుణంలో భారత్ స్వాతంత్యోత్సవం నాడు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై భరత జాతీయజండాను ప్రదర్శించటం, ప్రధాని మోడీ అధికారిక పర్యటనల్లో సైతం మన జాతీయజండాను గౌరవిస్తూ వస్తున్న యూఏఈ కి 'మేము సైతం' అంటూ యూఏఈ పై తమ అభిమానాన్ని చాటుతున్నారు మళయాళ సినీ నటులు.

పద్మ భూషణ్ గ్రహీత, ప్రముఖ సినీ నటుడు మోహన్ లాల్ తన అద్భుత నటనతో ఎందరో హృదయాలను గెల్చుకొని 300 పైగా చిత్రాల్లో నటించారు. ఆయనకు యూఏఈ తో మంచి వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయ్. యూఏఈ యొక్క 48వ నేషనల్ డే మరియు 'Year of Tolerance' ను పురస్కరించుకొని 'Big Salute to UAE: the Land of Happiness, Opportunity and Tolerance' పేరున ఈవెంట్ ను డిసెంబర్ 2న తమిళనాడు లోని కోయింబతూర్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుక యూఏఈ పై మాకు గల అభిమానం ను తెలియజేసే ఒక ప్రయత్నం అని మోహన్ లాల్ అన్నారు.

యూఏఈ లోని ప్రవాస భారతీయులు ఈ వేడుకను జయప్రదం చేసేందుకు తమ సహాయసహకారాలు అందిస్తున్నారు అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com