సౌదీకి ఆయుధ విక్రయాల నిలిపివేత..లేబర్ పార్టీ నేత జెరిమీ కార్బిన్ ప్రకటన
- December 04, 2019
లండన్: ఈ నెల 12న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే ప్రస్తుతం యెమెన్‌పై యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని స్మశానంగా మారుస్తున్న సౌదీకి ఆయుధ విక్రయాలను నిలిపివేస్తామని బ్రిటన్ లేబర్‌పార్టీ నేత జెరిమీ కార్బిన్ ప్రకటించారు. ఎన్నికల ముందు లేబర్ పార్టీ అనుసరించే విదేశాంగ విధాన లక్ష్యాలను ఆవిష్కరించిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ యెమెన్‌పై ప్రస్తుతం కొనసాగుతున్న పోరుకు తెరదించే విధంగా సౌదీని కట్టడి చేసేందుకు ఆ దేశానికి ఆయుధ విక్రయాలను తాము నిలిపివేస్తామని చెప్పారు. సౌదీకి మద్దతుగా ప్రస్తుత కన్జర్వేటివ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తాము సమర్ధించబోమని ఆయన స్పష్టం చేశారు. లేబర్ పార్టీ అనుసరించే కొత్త అంతర్జాతీయ విధానంలో తాము 40 కోట్ల పౌండ్ల పెట్టుబడితో యుద్ధ నివారణ, శాంతి నిధిని ఏర్పాటుచేస్తామని చెప్పారు. యెమెన్, ఇజ్రాయిల్, పాలస్తీనా భూభాగాలలో కొనసాగుతున్న సాయుధ ఘర్షణలకు ఆజ్యం పోయకుండా తాము ఆయుధ ఎగుమతులను కట్టడి చేస్తామని, ఇందుకు అనుగుణంగా తాము దౌత్య సామర్ధ్యాన్ని విస్తరిస్తామని చెప్పారు. ఆయుధ విక్రయాలలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, చైనాల తరువాత బ్రిటన్ ప్రపంచంలో ఆరోస్థానంలో నిలిచినట్లు స్టాకహేోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా అధ్యయనంలో వెల్లడయింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







