'వైఎస్సార్‌ లా నేస్తం' ప్రారంభించిన ఏ.పి సీఎం

- December 03, 2019 , by Maagulf
'వైఎస్సార్‌ లా నేస్తం' ప్రారంభించిన ఏ.పి  సీఎం

అమరావతి: జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు 'వైఎస్‌ఆర్‌ లా నేస్తం' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్‌ఆర్‌ లా నేస్తం వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. న్యాయవాద వృత్తిలో స్థిరపడే వరకు మూడేళ్లపాటు నెలకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. 2016 తర్వాత లా పరీక్ష ఉత్తీర్ణులైన వారు ఈపథకానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు స్టైఫండ్‌ ఇవ్వడంపై ముఖ్యమంత్రికి న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు మంజూరుచేయడంపై కూడా న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com