దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై 'సజ్జనార్ ' వివరణ

- December 06, 2019 , by Maagulf
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై 'సజ్జనార్ ' వివరణ

హైదరాబాద్:దిశ హత్య కేసు నిందితులను శుక్రవారం ఉదయం చటాన్‌పల్లి దగ్గర ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అసలు ఈ ఎన్ కౌంటర్ ఎలా జరిగింది..ఎన్ని గంటలకు జరిగింది..ఎంత మంది పోలీసుల ఆధ్వర్యంలో జరిగిందనే వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు.

ఆయన తెలిపిన ప్రకారం..బాధితురాలి వాచ్‌, సెల్‌ఫోన్‌ గురించి చెప్పడంతో శుక్రవారం తెల్లవారుజామున నిందితులను చటాన్‌పల్లికి తీసుకువచ్చాం. సెల్‌ఫోన్‌ అక్కడ, ఇక్కడ పెట్టామని చెప్పడం జరిగింది. ఆ సమయంలోనే పోలీసులపై కర్రలు, రాళ్లతో నిందితులు దాడి చేయడం జరిగింది. పోలీసుల వద్ద ఉన్న రెండు ఆయుధాలను నిందితులు లాక్కొని ఫైరింగ్‌కు యత్నించారు. పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితులు వినలేదు. పలుమార్లు హెచ్చరించిన తర్వాతే ఆత్మరక్షణ కోసం నిందితులపై ఫైర్‌ చేశారు పోలీసులు.

కరుడుగట్టిన నేరస్తులు వీళ్లు. ఏ1 ఆరిఫ్‌ పాషా, ఏ4 చెన్నకేశవులు వద్ద రెండు ఆయుధాలను రికవరీ చేశాం. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్ గౌడ్ కు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించాం. అనంతరం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించాం. నిందితుల దాడిలో పోలీసుల తలకు గాయాలయ్యాయి అని తెలిపారు. మొత్తం పది మంది ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 5.45 గంటల నుంచి 6.15 గంటల మధ్య ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com