కువైట్ లో నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ గుట్టు రట్టు

- December 06, 2019 , by Maagulf
కువైట్ లో నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ గుట్టు రట్టు

కువైట్ లో యూనివర్సిటీ డిగ్రీ నకిలీ సర్టిఫికెట్ల బండారం బయటపడింది. యూనివర్సిటీకి వెళ్ళకుండానే, పరీక్షలు రాయకుండానే దాదాపు వంద మంది నకిలీ సర్టిఫికెట్లు పొందినట్లు స్థానిక దినపత్రిక అల్-అన్బా వర్గాలు వెల్లడించాయి.

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ గత మూడు వారాలుగా జరుపుతున్న విచారణ ముగిసింది. నకిలీ సర్టిఫికెట్లు పొందిన వంద మంది కువైటీలు ఇప్పటికే పలు ఉద్యోగాల్లో చేరినట్లు వెల్లడైంది. ఈ కేసుకు సంసు కొందరు అనుమానితులపై నకిలీ సర్టిఫికెట్లతో అక్రమార్జన, అక్రమ మార్గంలో ప్రయోజనాలు పొందినట్లు స్థానిక మీడియా తన కథలో పేర్కొంది.

విదేశీ యూనివర్సిటీల నుంచి డిగ్రీ సర్టిఫికెట్లు అనుమానితులు చెబుతున్నా.. అవన్నీ అసత్యాలే అని చెప్పేందుకు తమ విచారణలో కీలక సాక్ష్యాలు లభ్యమయ్యాయని కువైట్ అధికారి వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి సర్టిఫికెట్లు పొందినట్లుగా చెబుతున్న ఈజిప్టియన్ యూనివర్సిటీలో గత జనవరి 5 నుంచి 25 వరకు ఎగ్జామ్ జరిగాయి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు కేవలం రెండు మూడ్రోజులు మాత్రమే విదేశాలకు వెళ్ళినట్లు తెలుస్తోందని వెల్లడించాయి. దీన్ని బట్టి వారు పరీక్షలు కూడా రాయలేదని స్పష్టం అవుతుందని తెలిపాయి. 

క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ వర్గాలకు ఉన్నత విద్యా మండలి నుంచి అందిన సమాచారం మేరకు విదేశీ యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు పొందిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఈ ఫ్రాడ్ లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే..ఈజిప్టియన్ యూనివర్సిటీల నుంచి జారీ అయిన ఈ నకిలీ సర్టిఫికెట్లపై సీల్ అసలైనవా, కావా తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు విద్యా మంత్రిత్వశాఖ ఈజిప్టియన్ యూనివర్సిటీలను సంప్రదిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com