ఒమన్:మానవత్వాన్ని చాటిన చిరు మెగా యూత్ ఫోర్స్
- December 06, 2019
మస్కట్:మానవసేవయే -మాధవసేవ ::ప్రార్దించే పెదవులకన్నా -సేవచేసే చేతులు మిన్న అన్న నీతిని చిరు మెగా యూత్ ఫోర్స్ ( మస్కట్ )సభ్యులు ఎప్పుడూ ఆచరించడము వక్కంత ఆదర్శనీయముగాను, మరింత గర్వముగా కూడా ఉంటుంది.ఇటీవల మస్కట్ లో గత కొన్ని ఏళ్ళు గ వీసా మరియు ఒమన్ ధ్రువీకరణ పత్రము ( రెసిడెంట్ కార్డు )లేకున్నా ఉంటూ అనారోగ్యము పాలై ,ఈ మధ్యనే తన కుమారుడు కుటుంబ కలహాల వలన ఆత్మహత్య చేసుకున్న కారణముగా ,పుట్టెడు దుఃఖం తో సొంత ఊరు ఎలా అయినా వెళ్ళాలి అన్న ఈమె కోరికకు , అపరాధ రుసుము సుమారు ( 1500రియాల్స్ -రెండు లక్షల ఎనబైవేలు )కట్టిన యెడల దేశము నుంచి వదిలే పరిస్థితి నుంచి రూపాయి ఖర్చు లేకున్నా అహర్నిశలు కార్యాలయూలు చుట్టు తిరిగి , బ్రతిమిలాడి , స్వదేశము పంపిన ఘనత ..చాలా దీనావస్థ పరిస్థితి లో ఉన్న తూర్పు గోదావరి జిల్లా, k .గన్నవరం ప్రాంత వాసి అయిన బేబీ సరోజని ని సంబంధిత కార్యాలయాలలో ,ప్రతి దినము తిరుగుతూ భారతదేశ రాయబార కార్యాలయ సహయముతో , ఒమన్ దేశం లేబర్ కోర్ట్ వారి సహాకారముతో నిన్న అనగా ( 4-12-2019)సొంత దేశము పంపడము జరిగింది.ఈ మొత్తము ఎపిసోడ్ కు గ్రూపు సీనియర్ సబ్యులు పొలసాని లింగన్న చేయూత నివ్వగా , హైదరాబాద్ కు టికెట్ సహాయము BSN మూర్తి చేయగా , తుమ్మూరి నాగబాబు 50 రియాల్స్ ,కుకునూరి వెంకట్ 25 రియాల్స్ సహాయము చేసి ,ఎట్టకేలకు బేబీ సరోజని మాతృ భూమి కి చేరింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు