24గంటలూ NEFT బ్యాంక్ సేవలు
- December 07, 2019
ఇండియా:డిజిటల్ ట్రాన్సక్షన్‌లను ప్రమోట్ చేసే దిశగా ఆర్బీఐ శుక్రవారం సరికొత్త నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సఫర్ (NEFT) విధానాన్ని డిసెంబరు 16నుంచి 24గంటలూ అందుబాటులోకి తీసుకురానుంది. NEFT ట్రాన్సాక్షన్‌లను గంటకోసారి సెటిల్ చేస్తారు. పనిదినాలలో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకూ పనిచేస్తారు.
వారాంతాల్లో అయితే ఉధయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ సేవలందిస్తారు. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ 24X7సేవలు అందిస్తామని ప్రకటించింది. ఎన్ఈఎఫ్‌టీ ట్రాన్సాక్షన్‌ల తొలి సెటిల్‌మెంట్‌ను డిసెంబరు 16వ తేదీ అర్ధరాత్రి 00:30గంటలకు పూర్తి చేస్తారు.
ఏదైనా ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోతే 2గంటల్లోగా అకౌంట్‌కు యాడ్ అయిపోతాయి. ఆర్బీఐ బ్యాంకులు అన్ని ఎన్ఈఎఫ్‌టీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది ఆర్బీఐ. బ్యాంకులు ఈ సమాచారాన్ని కస్టమర్లకు తెలియజేయాలని వెల్లడించింది.
దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్‌లను ప్రోత్సహించేందుకు జూలై 1వ తేదీనే బ్యాంకులన్నీ ఎన్ఈఎఫ్‌టీ, ఆర్టీజీఎస్‌లపై ఛార్జీలు ఎత్తేసింది. గతంలో ఉండే ఛార్జీలను ఎత్తేయడంతో పాటు మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూని కూడా పెంచింది ఆర్బీఐ. ఇందులో భాగంగానే ఎన్ఈఎఫ్టీ నిధుల లావాదేవీలను రూ.2లక్షల వరకూ పెంచింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..