కువైట్:డ్రైవర్ల నియామకంపై నిబంధనలు
- December 07, 2019
కువైట్ లో డ్రైవర్ల నియామకంపై ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. ఇక నుంచి కుటుంబానికి ఇద్దరు డ్రైవర్లను మాత్రమే అనుమతించనున్నారు. ఈ మేరకు అన్ని డైరెక్టరేట్లలోని డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక దినపత్రిక అల్-అన్బా తన కథనంలో వెల్లడించింది.
ఒకవేళ మూడవ డ్రైవర్ కావాలని భావించేవారు సంబంధిత అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మేజర్-జనరల్ తలాల్ మారాఫియర్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దుల్ ఖాదర్ షాబన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందవలసి ఉంటుంది.
ఆర్టికల్ 20 కింద ఉద్యోగుల సంఖ్యను కుదించటమే లక్ష్యంగా కువైట్ ఈ కొత్త నిబంధనలు రూపొందించింది. అలాగే రోడ్లపై రద్దీ తగ్గుతుందని ఆశిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..