బహ్రెయిన్:ఈవ్ టీజింగ్ గ్యాంగ్ పై చర్యకు డిమాండ్

- December 08, 2019 , by Maagulf
బహ్రెయిన్:ఈవ్ టీజింగ్ గ్యాంగ్ పై చర్యకు డిమాండ్

బహ్రెయిన్:బహ్రెయిన్ లో హద్దు దాటి ప్రవర్తిస్తున్న ఈవ్‌ టీచర్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు అధికారులను కోరుతున్నారు. మనమా పబ్లిక్‌ పార్క్‌ ప్రాంగణంలో ప్రతినిత్యం ఈవ్‌ టీజింగ్ గ్యాంగ్ అటుగా వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధితులు అవేదన వ్యక్తం చేశారు. మనమలోని అవాళ్  స్క్వెర్‌ దగ్గర ప్రతీ రోజు సాయంత్రం వేళలో అల్లరిమూక వచ్చి చేరుతుందని అంటున్నారు. ఆ మార్గం గుండా వెళ్లే మహిళల్ని లక్ష్యంగా చేసుకొని అసభ్యపదజాలంలో వేధిస్తున్నారని తమ బాధను వ్యక్తం చేశారు.

భార్యభర్తలను కూడా ఈవ్‌ టీజింగ్ గ్యాంగ్ వదలిపెట్టడం లేదు. అల్లరిమూకల వెకిలి వేషాలతో ఇక్కడ ఉండాలంటేనే ఇబ్బందిగా మారుతోందని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ గృహిణి అన్నారు. "ప్రతి రోజు తాగి వచ్చి గ్యాంగ్ అంతా ఇక్కడే జమ అవుతారు. అసభ్యంగా కామెంట్లు చేయటమే కాకుండా మహిళల మీద పడినంత పని చేస్తారు. ఏ మహిళకైనా అది భయానక అనుభవమే" అని గృహిణి వివరించింది. ఇలాంటి ప్రమాదకర వ్యక్తులను ఊరికే వదలొద్దని, కఠిన చర్య తీసుకోవాలని అధికారులను కోరారు.

ప్రపంచంలోనే బహ్రెయిన్ మహిళలకు ఓ మంచి దేశం అని, కొద్ది రోజుల క్రితమే బహ్రెయిన్ వుమెన్స్‌ డే కూడా జరుపుకున్నామని బాధిత మహిళలు గుర్తు చేశారు. అలాంటి పార్క్ లో జరుగుతున్న వేధింపు ఘటనలు బహ్రెయిన్ ప్రతిష్టకు భంగం కలింగించేవిగా ఉన్నాయని అన్నారు. వేధింపులతో పాటు మహిళలను ఫోటోలు తీయటం, శారీరక సుఖం కోసం వెంపర్లాడుతూ జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్న వారి వేధింపులను భరించలేకపోతున్నామని మరో మహిళ తన అవేదన వ్యక్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com