'కెజిఎఫ్' చాప్టర్ -1 సంచలన రికార్డు
- December 08, 2019
గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ ప్రతిష్టాత్మక సినిమా కెజిఎఫ్ చాప్టర్ -1 ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. స్వతహాగా కన్నడలో చిత్రీకరించబడ్డ ఈ సినిమాను మన టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, కొంత సినిమాను వీక్షించిన తరువాత, దీనిని కేవలం కన్నడకు మాత్రమే పరిమితం చేయకుండా, దేశవ్యాప్తంగా పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయండి అని సలహా ఇవ్వడం జరిగింది.
కాగా రాజమౌళి సలహా మేరకు ఆ సినిమాను పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసిన సినిమా యూనిట్, అన్ని భాషల్లోనూ అద్భుత విజయాన్ని అందుకుని విపరీతమైన లాభాలు అందుకున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఒక అత్యద్భుతమైన రికార్డు ని సొతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా విడుదల సమయంలో మంచి రికార్డ్స్ నమోదు చేసిన ఈ సినిమా, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో కూడా భారీ వీక్షకాధరణతో దూసుకుపోతోంది.
ఇక ఈ ఏడాది ఇప్పటివరకు అన్ని భాషల్లో కలుపుకుని అత్యథిక వ్యూస్ సాధించిన సినిమాగా కెజిఎఫ్ చాప్టర్ వన్ భారత దేశ చరిత్రలో ఒక అత్యద్భుత రికార్డు ని సొంతం చేసుకుంది. కన్నడ రాక్ స్టార్ యాష్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం చాప్టర్ 2 అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాను హోంబేలె ఫిలింస్ వారు భారీ స్థాయిలో నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా సీక్వెల్ అయిన చాప్టర్ 2 వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా కెజిఎఫ్ చాప్టర్ 1 అమెజాన్ లో ఇంతటి అద్భుతమైన రికార్డు ని దక్కించుకోవడంతో సినిమా యూనిట్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..