అబుధాబి:నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు

- December 08, 2019 , by Maagulf
అబుధాబి:నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు

అబుధాబి:వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని అబుదాబి పోలీసులు డ్రైవర్లను కోరారు. ముఖ్యంగా యువ డ్రైవర్లు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా వాహనం డ్రైవ్ చేసినా లోయల్లోకి వాహనాలను దూసుకెళ్లాలా ర్యాష్ డ్రైవింగ్ చేసినా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. రోడ్లపై ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే 2000ల దిర్హామ్ల జరిమానతో పాటు 23 బ్లాక్ పాయింట్లు, 60 రోజుల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు వెల్లడించారు. రహదారులపై ప్రతినిత్యం తమ నిఘా ఉంటుందని ట్రాఫిక్ అండ్ పాట్రోల్స్ డైరెక్టరేట్ తెలిపింది. రోడ్లపై ప్రమాదాల నివారణకు వాహనాల మధ్య  నిర్దిష్ట దూరం మెయిన్టేన్ 
పాటించాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com