ఎక్స్పాట్ వీసా ఫీజులతో ఒమన్ కి అధిక ఆదాయం

- January 14, 2016 , by Maagulf
ఎక్స్పాట్ వీసా ఫీజులతో ఒమన్ కి అధిక ఆదాయం

2016 జనవరి 1 నుంచి రాయల్ ఒమన్ పోలీసులు, వీసాలను ప్రాసెస్ చేసే కంపెనీల నుంచి 20 ఒమన్ రియాల్స్ని ఛార్జ్ చేస్తున్నారు. కొత్త వీసాలు, వీసా రెన్యువల్స్కి ఈ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. గతంలో ఈ ఛార్జీలు ఉచితం. ఎక్స్పాట్స్ (వలసదారుల) కుటుంబ సభ్యులకు మాత్రం ఫీజు ఉండేది. గత నవంబర్ నాటికి గణాంకాల ప్రకారం 1,682,752 వలస కార్మికులు ఒమన్లో పనిచేస్తున్నారు. కొత్తగా వచ్చేవారు రెన్యువల్స్, బ్యాలన్స్ ఔట్ డిపాచ్యుర్స్ ఇవన్నీ కలుపుకుంటే 33,665,040 ఒమన్ రియాల్స్ 2017 చివరి నాటికి ఆదాయం సమకూరే అవకాశముందని అంచనా వేశారు. ఈ విధానంతో దేశ ఆర్థిక వ్యవస్థకు 16.82 మిలియన్ ఒమన్ రియల్స్ అదనంగా చేకూరనుంది. చాలా దేశాలు వలసదారులకు సర్వీస్ ఛార్జీలను వర్తింపజేస్తున్నాయని, ఒమన్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం గతంలోనే తీసుకుని ఉంటే కేవలం చమురు అమ్మకాలపైనే ఆధారపడాల్సిన అవసరం లేకుండా దేశం ఆర్థికంగా స్థిరపడేదని మస్కట్ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ సలీమ్ అల్ ఘమ్మారి చెప్పారు. కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని రషీద్ ఖల్ఫాన్ ఇప్పుడు విధిస్తున్న సర్వీస్ ఛార్జ్ నామమాత్రంగానే ఉందనీ, భవిష్యత్తులో ఇది పెరిగితే ఇబ్బంది తప్పదని అన్నారు. ప్రభుత్వం కంపెనీల భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుని ఫీజు పెంపు నిర్ణయాలు తీసుకుంటే అభ్యంతరం లేదని ఆయన అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com