'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ వేడుక తేదీ ఫిక్స్
- December 15, 2019
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు తొలిసారి మేజర్ అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి చాలా రోజుల తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫొటోగ్రఫీని అందిస్తున్నారు. మహేష్ బాబు, దిల్ రాజు,
అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కు సంబంధించి ఇప్పటికే రెండు సాంగ్స్ మరియు టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు అనిల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నటు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 2020 జనవరి 5న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన ను రిలీజ్ చేసింది. ఇక ఈన్యూస్ బయటకు రాగానే మహెష్ ఫ్యాన్స్ సంబరాలు మొదలెట్టేశారు.
ఈ సినిమాలోని మూడవ పాటను రేపు సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. కాగా థియేట్రికల్ ట్రైలర్ ను నూతన సంవత్సర కానుకగా జనవరి 1న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. వరుసగా భరత్ అనే నేను, మహర్షి సినిమాల సక్సెస్ లతో మంచి జోష్ మీదున్న సూపర్ స్టార్, తప్పకుండా ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకుంటారని ఆయన ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!!
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







