కారు హైజాక్: ఒకరి అరెస్ట్
- December 16, 2019
మస్కట్: పోలీస్ అధికారి వేషం వేసి కారు హైజాక్‌కి పాల్పడిన క్రిమినల్‌కి మూడేళ్ళ జైలు శిక్ష 200 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. మే 5న ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కారు డోర్ కొట్టి, పోలీస్ అధికారిలా తనను బెదిరించారంటూ బాధితుడు ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ చేపట్టిన అధికారులు, నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కారుతో సహా తనను కిడ్నాప్ చేసిన నిందితుడు, తనను కొంత దూరం తీసుకెళ్ళి కారులోంచి తోసేసినట్లు బాధిత వ్యక్తి పేర్కొన్నారు. బాధితుడి నుంచి నిందితుడు మొబైల్ ఫోన్‌తోపాటు 150 ఒమన్ రియాల్స్ కూడా దొంగిలించాడు. విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







