దుబాయ్ లో మైండ్ బ్లాంక్ ఇన్సిడెంట్; సెల్లార్ లో హెలికాఫ్టర్ పార్కింగ్
- December 21, 2019
దుబాయ్ లో ఓ వింత సంఘటన స్థానికులకు మతి పోగొట్టినంత పని చేసింది. హెలిప్యాడ్ లో పార్క్ చేయాల్సిన హెలికాఫ్టర్ ను సెల్లార్ లో వెహికిల్స్ పార్క్ చేసే ప్లేస్ లో పార్క్ చేశారు. అయితే..ఎవరు పార్క్ చేశారో తెలియదు. అసలు సెల్లార్ లోకి ఎలా తీసుకొచ్చారో అంతుబట్టడం లేదు. కానీ, విచిత్రంగా హెలికాఫ్టర్ సెల్లార్ లో పార్క్ చేశారనేది
మిస్టరీగా మారింది. దుబాయ్ జుమెరహ్ లేక్స్ టవర్స్‌లోని మోవెన్పిక్ హోటల్లో సెల్లార్ లో షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. జుమెరహ్ లేక్స్ టవర్స్‌లోని పిజ్జా ఎక్స్ ప్రెస్ వెళ్లాల్సిన వ్యక్తి అనుకోకుండా సెల్లార్ ఫ్లోర్ లో దిగటంతో హెలికాఫ్టర్ పార్కింగ్ విషయం బయటపడింది. బేస్ మెంట్ లెవల్ కి త్రీలో హెలికాఫ్టర్ నుంచి షాక్ అయినట్లు అతను
చెబుతున్నాడు. తాను ఇప్పటివరకు అలా చూడలేదని, ఒక్క క్షణం మతిపోయినంత పనైందని అతను చెబుతున్నాడు. హెలికాఫ్టర్ సెల్లార్ లో ఎవరు పెట్టారో తేల్చేందుకు అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే..హెలికాఫ్టర్ మోవెన్పిక్ హోటల్ బిల్డింగ్ లోని ఓ రెస్టారెంట్ ఓనర్ ది అని హోటల్ స్టాఫ్ చెబుతున్నారు. మూడు వెహికిల్స్ పార్కింగ్ స్థలాన్ని హెలికాఫ్టర్ పార్కింగ్ కోసం అక్యుపై చేసినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







