టీనేజ్ సిస్టర్స్‌పై అత్యాచారం: బహ్రెయినీ వ్యక్తికి జైలు శిక్ష
- December 21, 2019
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్ట్ 30 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఇద్దరు టీనేజ్ సిస్టర్స్‌పై నిందితుడు అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. అందులో ఓ బాలిక వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. నిందితుడు, బాధితుల్ని బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేసినట్లు విచారణలో గుర్తించారు. బాధితుల్లో మరో బాలిక వయసు 18 సంవత్సరాలు. సోషల్ మీడియా ద్వారా 18 ఏళ్ళ యువతిని ట్రాప్ చేసి, ప్రేమిస్తున్నట్లు నటించి.. ఆమె ద్వారా ఆమె సోదరిని కూడా లొంగదీసుకున్నాడు నిందితుడు. తన ఇంట్లో ఇద్దరు బాలికలపైనా నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, బాధిత బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు వున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







