'కేజీయఫ్‌ చాప్టర్‌ 2' ఫస్ట్‌లుక్‌ విడుదల

- December 21, 2019 , by Maagulf
'కేజీయఫ్‌ చాప్టర్‌ 2' ఫస్ట్‌లుక్‌ విడుదల

సౌత్‌ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించి, బాక్సాఫీస్‌ వద్ద రూ. 200 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా కేజీయఫ్‌ . ప్రశాంత్‌ నీల్‌ దర్శకత‍్వం వహించిన ఈ సినిమా 2018లో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో కన్నడ స్టార్‌ యశ్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాకు సీక్వేల్‌గా కేజీయఫ్‌ చాప్టర్‌ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శనివారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. కేజీఎఫ్‌ మొదటి భాగం (21 డిసెంబర్‌ 2018) విడుదలైన సరిగ్గా ఏడాదికి గుర్తుగా ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.
'సామ్రాజ్యం పునర్నిర్మితమవుతుంది' అంటూ కేజీయఫ్‌లో పనిచేసేవారితో పెద్ద స్తంభాన్ని లాగుతూ యశ్‌ కనిపించారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్‌ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేదిగా ఉంది. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి రవి బాసుర్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, శరణ్‌ శక్తి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com