చికెన్ దో ప్యాజ్
- January 15, 2016
కావలసిన పదార్థాలు: చికెన్ - కేజి, ఉల్లిపాయలు - అరకేజి, పెరుగు - పావు లీటరు, కారం - 2 టీ స్పూన్లు, గరం మసాలా - 1 టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూను, పసుపు - 1 టీ స్పూను, ధనియాల పొడి - 1 టీ స్పూను, టమోటా గుజ్జు - 2 కప్పులు, నూనె - తగినంత, గుడ్లు - 4 ఉడికించినవి.
తయారీ విధానం: ముందుగా ఒక పాన తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. అందులో గరం మసాలా దినుసులు వేయాలి. తర్వాత మిక్సీలో పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పానలో వేగుతున్న హోల్ గరం మసాలాకు కలిపి వేయించాలి. రెండు నిమిషాల తరువాత అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత టమోటా గుజ్జు వేసి మరో రెండు నిమిషాలు వేయించి, అవసరమనుకుంటే కొద్దిగా నీళ్ళు కలుపుకోవాలి. ఉడుకుతున్న గ్రేవీలో చికెన్ ను కలిపి మరో పది నిమిషాలు మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. చికెన్ మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఉడికించిన గుడ్లను కలుపుకుని ఒక నిమిషం తర్వాత గుండ్రంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసి ఉడికించాలి. అంతే చికెన్ దో ప్యాజ్ రెడీ.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







