దుబాయ్ ఎక్స్పో 2020 - నో కస్టమ్స్ డ్యూటీ
- December 24, 2019
దుబాయ్ ఎక్స్పో 2020కి సంబంధించి కస్టమ్స్ క్లియరెన్స్ సిస్టమ్‌ని రూపొందించినట్లు దుబాయ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దుబాయ్ ఎక్స్పో 2020లో ప్రదర్శన, అమ్మకం కోసం వుంచే గూడ్స్‌ని వేగంగా, సులభంగా ప్రాసెస్ చేసేందుకు వీలుగా ఈ కొత్త సిస్టమ్‌ని అభివృద్ధి చేశామని అధికారులు తెలిపారు. ఎలాంటి కస్టమ్స్ డ్యూటీస్ లేకుండా దుబాయ్ ఎక్స్పో 2020లో ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కస్టమ్స్ సెంటర్స్‌కి వెళ్ళే ఇబ్బంది లేకుండా ఎగ్జిబిటర్స్, తమ రిజిస్ట్రేషన్‌ని ఆన్లైన్ ద్వారా చేపట్టవచ్చు. స్థానిక మరియు ఫెడరల్ ఎన్‌టైటీస్ ద్వారా కొన్ని ప్రత్యేక వస్తువుల విక్రయానికీ వెసులుబాట్లు కల్పించినట్లు దుబాయ్ కస్టమ్స్ - కస్టమర్ మేనేజ్మెంట్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్లా మొహమ్మద్ అల్ ఖాజా చెప్పారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







