ఆకాశ హార్మ్యాలు కేరాఫ్ దుబాయ్
- January 16, 2016
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మొత్తం 100 ఆకాశ హార్మ్యాలున్నాయి. 300 మీటర్ల (984 అడుగులు) కన్నా ఎక్కువ వున్నవాటినే ఆకాశ హార్మ్యాలు లేదా స్కైస్క్రాపర్స్‌గా లెక్కలేస్తున్నారు. ఇటీవల పూర్తయిన న్యూయార్క్‌లోని 432 పార్క్ అవెన్యూతో ఆకాశ హార్మ్యాల లెక్క 100కి చేరుకుంది. 1930 నుంచి 2010 మధ్యలో 50 ఆకాశ హార్మ్యాలు నిర్మించగా, కేవలం గత ఐదేళ్ళలోనే యాభై ఆకాశ హర్మ్యాలను నిర్మించడం జరిగిందని కౌన్సిల్ ఆన్ టాల్ బిల్డింగ్స్ అండ్ అర్బన్ హ్యాబిటాట్ వెల్లడించింది. వీటిని 'సూపర్‌టాల్స్'గానూ వ్యవహరిస్తున్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింతగా పెరగనుంది. సూపర్‌టాల్స్ వరకూ దుబాయ్ నెంబర్ వన్‌గా ఉంది. ఇక్కడ మొత్తం 17 సూపర్‌టాల్స్ ఉన్నాయి. న్యూయార్క్ రెండో స్థానంలో ఏడు సూపర్‌టాల్స్‌తో నిలిచింది. అబుదాబీలో నాలుగున్నాయి. సిటిబియుహెచ్ అదికారికంగా 432 పార్క్ ఎవెన్యూస్ నిర్మాణాన్ని ధృవీకరించింది. డిసెంబర్ 23, 2015తో ఈ ఇశ్రీనర్మాణం పూర్తయ్యింది. ఇది రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌లో నెంబర్ వన్ పేస్‌ని దక్కించుకుంది. అతి త్వరలో మెగామాల్ 600 మీటర్లకన్నా ఎక్కువ ఎత్తుతో నిర్మితం కానుంది. ప్రస్తుతానికి కేవలం మూడు మాత్రమే మెగా టాల్ బిల్డింగ్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ మెగా బిల్డింగ్స్ డబుల్ అవుతాయని అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా టవర్, కౌలాలంపూర్‌లోని కెఎల్118 టవర్ మెగాటాల్ బిల్డింగ్స్ కేటగిరీలో కొత్తగా గుర్తింపు తెచ్చుకున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







