మనాలి లో 'వి' షెడ్యూల్ పూర్తి..
- December 26, 2019
సుధీర్ బాబు - నాని కాంబినేషన్ లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మనాలి షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. మనాలిలో గడ్డ కట్టించే చలిలో సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారట.
ఈ చిత్రాన్ని యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నారు. గతానికి భిన్నంగా నాని సరికొత్త రోల్ చేస్తున్నారు. నెగెటివ్ షేడ్స్ కలిగిన సీరియల్ కిల్లర్ గా నాని రోల్ ఉంటుందని సమాచారం. 'వి' మూవీని అధిక బడ్జెట్ తో చాలా రిచ్ గా నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చ్ 25న 'వి' చిత్రం విడుదల కానుంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







