ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో అంకురభారత్ ప్రారంభించిన ప్రధాని
- January 16, 2016
ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో అంకురభారత్ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం. యువ వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించడంపై మార్గసూచి విడుదల చేశారు. వినూత్న ఆలోచనలతో సంస్థలు ఏర్పాటు చేసే వారికి ప్రోత్సాహం, నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడమే అంకుర భారత్ లక్ష్యం. స్వయం ఉపాధి, స్వావలంభన ప్రోత్సహం దిశగా కేంద్రం అడుగు వేసింది. 35లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చేలా పథకం రూపకల్పన చేశారు. అంకుర్ భారత్ గురించి ఆగస్టు 15న ప్రకటన చేశానని ప్రధాని మోడీ తెలిపారు. స్టార్టప్‌లకు పన్నుల రాయితీలు, మూలధన లాభపన్నులో రాయితీ, మరెన్నో సౌకర్యాలు కల్పించనున్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







