తెదేపాలో చేరిన జయసుధ
- January 16, 2016
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సికిందరాబాద్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నటి అయిన జయసుధ శనివారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం నాడు విజయవాడ వచ్చిన ఆమె చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన తర్వాత మాట్లాడుతూ... హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడిదేనన్నారు. ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ప్రజలు ఎన్నుకోవడం దైవనిర్ణయమని చెప్పుకొచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి చాలాకాలం నుంచి దూరంగా ఉన్నానన్నారు. ఇక నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తానని చెప్పారు. కాగా 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన జయసుధ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







