పొగమంచు కారణంగా ఎదురెదురుగా ' ఢీ ' కొన్న 93 వాహనాలు - 23 మంది క్షతగాత్రులు
- January 16, 2016
దట్టమైన పొగమంచు పలు రోడ్డు ప్రమాదాలకి ముఖ్య కారణమైంది. ఎదురుగా వచ్చే వాహనాన్ని సమీపంలోనికి వచ్చేవరుకు వాహనాన్ని నడిపేవారు గుర్తించలేక పోవడంతో అబూధాబి రహదారిపై వివిధ వాహనాలు ' ఢీ ' కొని ఒక కుప్ప మాదిరీగా తయరయ్యయి. ఈ ప్రమాదాలలో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమ్ఘ్హతన్ గూర్చిన సమాచారం తెలియగానే, ట్రాఫిక్ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని ఆయా వాహనాల ప్రక్షాళన చర్యలు చేపట్టారు. దీంతో మరికొన్ని ప్రమాదాలు జరగకుండా, నిలువరించగలిగెమని అబూధాబి పోలీస్ ఉన్నతాధికారి బ్రిగేడియర్ ఖలీఫా మొహమద్ ముబారక్ అల్ ఖిలే తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదాలలో తొలుత అల్ సద్స్వెఇహన్ వంతెన సమీపంలో ఐదు వాహనాలు ఒకదానినొకటి ' ఢీ ' కొట్టుకున్నాయి. ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలో రెండవ ప్రమాదంలో 69 కార్లు ఒకదానినొకటి ' ఢీ ' కొట్టుకున్నాయి. 3 వ సంఘటనలో 8 కార్లు ఎదురెదురుగా గుద్దుకోన్నాయి. అలాగే నాల్గవ ప్రమాదం సైతం ఇదే మార్గంలో బుసంర వంతెన సమీపంలో 14 కార్లు ఒకదానినొకటి ' ఢీ ' కొట్టుకున్నాయని అంతరంగిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. రానున్నరోజులలో ఈ ప్రాంతాలలో దట్టమైన పొగమంచుతో పాటు వర్షాలు సైతం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాహనచోదకులు సరైన విపత్తు లైట్ లను ఉపయోగించకుండా మార్గసూచిలను పరిశీలించకుండా ఈ మార్గంలో ప్రయాణించడం ఎంతో ప్రమాదమని సంబంధిత శాఖాదికార్లు వాహనదార్లను హెచ్చరించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







