కలిసి నటించనున్న కృష్ణ, మహేష్ మరియు గౌతం..!!
- January 16, 2016
ఆ మధ్య అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాలు నటులు ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కలిసి 'మనం' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అందరూ ఒకే సినిమాలో కలిసి నటించడం, సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయ్యారు.ఘట్టమనేని ఫ్యామిలీ నటులైన కృష్ణ, మహేష్ బాబు, గౌతం కలిసి నటించాలని అభిమానులు చాలా కాలంగా ఆశ పడుతున్నారు. ఎట్టకేలకు వారి ఆశ తీరబోతోంది. ఈ ముగ్గురు స్టార్స్ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శ్రీ శ్రీ' అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు, గౌతం గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో కృష్ణ రెండో భార్య విజయ నిర్మల, విజయ నిర్మల తనయుడు నరేష్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ కృష్ణ లీడ్ చేస్తున్న సినిమా శ్రీ శ్రీ. స్వయంగా కృష్ణ మహేష్ బాబుతో మాట్లాడి ఆయన్ను ఒప్పించారట. అయితే ఈ విషయమై ఇంకా అపీషియల్ సమాచారం ఏమీ లేదు.
గతంలో దర్శకుడు ముప్పలలేని తాజ్ మహల్, రాజా, సంక్రాంతి లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వం చేస్తున్న ఈ సినిమా పగ ఎప్పటికి పాతది కాదు అన్న కథాంశంతో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







