`అశ్వథ్థామ` డబ్బింగ్ చెబుతున్న నాగశౌర్య
- December 30, 2019
యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `అశ్వథ్థామ`. రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన నిన్నే నిన్నే సాంగ్, టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్‌తో నాగశౌర్య మరింత ఉత్సాహాంగా డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. యథార్థ ఘటనల ఆధారంగా హీరో నాగశౌర్య ఈ కథను రాశారు. కేవలం యాక్షన్ ఎలిమెంట్సే కాదు.. మంచి మెసేజ్ ఉన్న చిత్రంగా సినిమాను రూపొందిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి జనవరి 31న సినిమాను విడుదల చేస్తున్నారు.
నటీనటులు:
నాగశౌర్య, మెహరీన్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: ఐరా క్రియేషన్స్
నిర్మాత: ఉషా ముల్పూరి
కథ: నాగశౌర్య
దర్శకత్వం: రమణతేజ
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి
డిజిటల్: ఎంఎన్ఎస్ గౌతమ్
డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్
యాక్షన్: అన్బరివు
కొరియోగ్రాఫర్: విశ్వ రఘు
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







