రామోజీ ఫిలిం సిటీ లో 'సీటీమార్'..

- January 02, 2020 , by Maagulf
రామోజీ ఫిలిం సిటీ లో 'సీటీమార్'..

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌..తమన్నా జంటగా సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం తాలూకా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. స్పోర్ట్స్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ లో గోపిచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తుండగా.. తమన్నా తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తోంది. రీసెంట్ గా మొదటి షెడ్యూల్ ను విజవంతంగా పూర్తి చేసిన చిత్ర యూనిట్..రెండో షెడ్యూల్ డేట్ ను ఖరారు చేసారు. జనవరి 18న నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు.

మొదటి షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు గోపీచంద్ కామెడీ సన్నివేశాలు తెరకెక్కించారట. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఈ కామెడీ సీక్వెన్సెస్ లో గోపీచంద్ తో పాటు తమన్నా, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి కూడా షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి 'సీటీమార్' అనే పేరును అనుకుంటున్నారట. చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో ఉండటం, మాస్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో చిత్రానికి ఈ టైటిల్ బాగా యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాను 'యు టర్న్' నిర్మాత శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయకిగా నటిస్తోంది. అలాగే సెకండ్ హీరోయిన్ పాత్రలో హిప్పీ ఫేమ్ దిగంగన సూర్యవంశీ నటించబోతున్నట్లు సమాచారం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com