'తెలుగు తరంగిణి' సంక్రాంతి సంబరాలు
- January 17, 2016
రాస్ అల్ ఖైమాలో తెలుగు తరంగిణి సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 నిమిషాలకు ప్రార్ధన, స్వాగత సందేశంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.సంప్రదాయం దుబాయి వారి సౌజన్యంతో శ్రీ గోదా రంగనాధుల కళ్యాణ మహోత్సవం, సామూహిక విష్ణు సహస్ర నామార్చన కన్నుల పండుగగా నిర్వహించబడింది.మధ్యాహ్నం చిన్న పిల్లలకు భోగిపళ్ళు, ఆశీర్వచనం, బొమ్మల కొలువు నిర్వహించారు. హరిదాసుల సందడి, మహిళల రంగ వల్లులు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చిన్న పిల్లలకు క్విజ్ పోటీలు నిర్వహించారు.నిర్వాహకులు రాస్ అల్ ఖైమాలో పల్లెటూరు వాతావరణాన్ని నెలకొల్పారు. సాయంత్రం 4 గంటలకు తంబోలా ఆట సరదా సరదాగా సాగింది తరువాత వివిధ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతుల్ని అందజేశారు. థ్యాంక్స్ మీట్‌తో ఈకార్యక్రమాలు ముగిశాయి. సంప్రదాయ విందు భోజనం, సాయంత్రం 4.30 నిమిషాలకు స్నాక్స్ ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ సురేష్ గారు, ఎక్షిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ గారు, సెక్రెటరి నందా గారు, ట్రషరర్ రాజేష్ గారు మరియు తరంగిణి సభ్యులు అందరూ కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. తెలుగు తరంగిణి సభ్యులు సుజన్ గారు, మైథిలి గారు ఏంకర్లుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా సహకారం అందించింది.మాగల్ఫ్.కామ్ టీం తరపున 'తెలుగు తరంగిణి టీం' కు అభినందనలు.







తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







