వరుస సినిమాలతో హీరోయిన్ రాశి సింగ్ బిజీ బిజీ
- January 11, 2020
పోస్టర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన భామ రాశి సింగ్. తన తొలి సినిమాతోనే తెలుగు మాట్లాడటం నేర్చుకొని వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆది సాయి కుమార్ తో ఒక సినిమా, దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ మరియు అరవింద్ కృష్ణ లు హీరోలుగా ఒక సినిమా, శివాజీ రాజా కొడుకు విజయ్ హీరోగా జెమ్ అనే సినిమాలో నటిస్తూ మరికొన్ని సినిమాలకు కథలు వింటున్నా అని చెప్పుకొచ్చింది ఈ ఛతీస్ ఘడ్ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు తెలుగు మాట్లాడుతుండటం తో పాటు నటనలో కూడా మంచి ప్రతిభ కలిగి ఉండటం వలన ఈ అమ్మడిని హీరోయిన్ గా తీసుకునేందుకు దర్శక నిర్మాతలు కూడా ఒకే అంటున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఏది ఏమైనా హీరోయిన్స్ కి తెలుగు మాట్లాడటం వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పుష్కలంగా వస్తాయని హీరోయిన్ రాశి సింగ్ మరోసారి నిరూపించింది.ఈ అమ్మడు నటించిన సినిమా పోస్టర్ అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..